భారతదేశం, మార్చి 6 -- Sai Dharam Tej: బ్రో త‌ర్వాత సినిమాల‌కు దాదాపు రెండేళ్ల పాటు గ్యాప్ ఇచ్చాడు మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్. ప్ర‌స్తుతం సంబ‌రాల ఏటిగ‌ట్టు పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోన్నాడు. మిస్ట‌రీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్లు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సంబ‌రాలు ఏటిగ‌ట్టు మూవీతో రోహిత్ కేపీ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.

సంబ‌రాల ఏటిగ‌ట్టు బ‌డ్జెట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. దాదాపు 125 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌క‌టించారు. మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీగా సంబ‌రాల ఏటిగ‌ట్టు నిల‌వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

సంబ‌రాల ఏటిగ‌ట్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ సార‌థ్యంలో ఇంటెన్స్ ...