Hyderabad, ఏప్రిల్ 1 -- సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే స్నాక్స్ సగ్గుబియ్యం మసాలా వడ. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది. వీటిని చాలా సింపుల్ తయారుచేయవచ్చు. చైత్ర నవరాత్రులు హిందూ మతంలో చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ తొమ్మిది రోజులూ దుర్గామాత భక్తులు 9 రోజుల పాటు ఉపవాసం ఉండి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. ఈ తొమ్మిదిరోజుల్లో సగ్గుబియ్యం వడలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి అనిపించనివ్వదు. సాయంత్రం పూట ఇవి స్నాక్స్ గా కూడా టేస్టీగా ఉంటాయి.

సాబుదానా - ఒక కప్పు

బంగాళాదుంపలు - రెండు

వేరుశెనగలు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాల పొడి - అర స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

జీలకర్ర పొడి - ఒక స్పూను

ఆమ్చూర్ పొడి - పావు స్పూను

క...