Hyderabad, ఫిబ్రవరి 23 -- Safest Countries: ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో ఊహించలేం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందేమోనని అనుకున్నారు. అది ఇప్పుడు చల్లబడింది. ఉగ్రవాదం కూడా విపరీతంగా పెరిగిపోతుండడంతో కొన్ని పెద్ద దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు కొన్ని దేశాల మీదకి యుద్ధానికి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. అలాగే సహజ వనరులు క్షీణించడం వల్ల కూడా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై ఆధిపత్యాన్ని సాధించేందుకు యుద్ధం చేయవచ్చు. ఇలా ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్దం వస్తే ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ ప్రభావితం అవుతాయి. అక్కడున్న ప్రజలకు నష్టం తప్పదు. కానీ కొన్ని దేశాలు మాత్రం సురక్షిత ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ దేశాలు భౌగోళికంగా సమృద్ధిగా ఉన్న వనరుల కారణంగా మూడో ప్రపంచ యుద్ధానిక...