భారతదేశం, ఫిబ్రవరి 16 -- భారతీయ కార్ల మార్కెట్‌లో రూ.10 లక్షల బడ్జెట్ లోపు కూడా మంచి మంచి కార్లు దొరుకుతాయి. ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ చేసి.. మంచి సేఫ్టీ రేటింగ్ ఇచ్చినా కార్లు తక్కువ ధరలో కూడా దొరుకుతాయి. మీరు కూడా రూ. 10 లక్షల లోపు సురక్షితమైన కారు కొనాలని ఆలోచిస్తుంటే.. ఈ కథనం మీ కోసమే. వాహనం భద్రతా రేటింగ్ కొనుగోలుదారులకు ఎంత సురక్షితమైనదో తెలియజేస్తుంది. బడ్జెట్ ధరలో మంచి సేఫ్టీ రేటింగ్‌తో వచ్చే కార్లు చూద్దాం..

రూ. రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభమవుతుంది. వయోజన ప్రయాణికుల రక్షణలో 32 పాయింట్లలో 31.46 పాయింట్లను, పిల్లల ప్రయాణికుల రక్షణలో 49 పాయింట్లలో 45 పాయింట్లను సాధించింది. 5-స్టార్ రేటింగ్‌ను సంపాదించింది.

రూ.7.99 లక్షల ఎక్స్‌ షోరూమ్ ధరతో ప్రారంభమయ్యే టాటా నెక్సాన్ కూడా సేఫ్టీ కారు. వయోజన, పి...