భారతదేశం, ఏప్రిల్ 12 -- Sachivalaya Staff Rationalization : స‌చివాల‌య ఉద్యోగుల‌ రేష‌న‌లైజేష‌న్‌పై రాష్ట్ర ప్రభుత్వం మార్గద‌ర్శకాలు విడుద‌ల చేసిన నేప‌థ్యంలో స‌చివాల‌య ఉద్యోగులు సానుకూలంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు ప‌నిభారం పెరుగుతోంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అయితే రేష‌న‌లైజేష‌న్‌ను స‌మర్థిస్తూనే ఉద్యోగ సంఘాలు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసిన మార్గద‌ర్శకాల్లో త‌ప్పులు ఉన్నాయ‌ని, వాటిని స‌రిచేయాల‌ని స‌చివాల‌య ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

1. రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన రేషనలైజేషన్‌ను స‌చివాల‌య‌ ఉద్యోగ సంఘాలు స‌మ‌ర్థిస్తున్నాయి. అయితే రేషనలైజేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లో తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

2. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఉ...