భారతదేశం, మార్చి 2 -- Sachivalaya Employee : ఆంధ్రప్రదేశ్‌లోని స‌చివాల‌య ఉద్యోగి పెన్షన‌ర్లకు ఇవ్వాల్సిన రూ.8.43 ల‌క్షల‌ డ‌బ్బులతో ప‌రార‌య్యాడు. దీంతో పెన్షన‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ ఘ‌ట‌న ప‌ల్నాడు జిల్లాలో దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ప‌రిధిలోని చోటుచేసుకుంది. రాష్ట్రం ప్రతి నెల 1 తేదీన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల న‌గ‌దును ల‌బ్ధిదారుల‌కు అందజేస్తుంది. ఒక‌టో తేదీన పెన్షన్ ఇచ్చేలా ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామ స‌చివాల‌య, వార్డు స‌చివాల‌య సిబ్బంది పెన్షన్ అందజేస్తున్నారు.

అందుక‌నుగుణంగానే ముందు రోజే, అంటే ముందు నెల ఆఖ‌రి తేదీన బ్యాంకుల నుంచి డ‌బ్బులను విత్‌డ్రా చేసి స‌చివాల‌య ఉద్యోగుల‌కు, వీఆర్‌వోలకు అంద‌జేస్తారు. స‌చివాల‌య ఉద్యోగుల‌కు వారి ప‌రిధిలో ఉన్న పెన్షన్లకు మొత్తం న‌గ‌దును తీసుకుని పెన్షన‌ర్లకు...