Hyderabad, జనవరి 27 -- Sabar Bonda Movie Review In Telugu: భారతదేశంలో స్వలింగ సంపర్కుడిగా ఉండటం అంటే ఏమిటి? ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ పట్ల సానుకూలంగా స్పందించే ఆధునిక దృక్పథాలు కలిగిన ప్రజలు ఉన్న మహానగరం కాదు భారతదేశం. ఇప్పటికీ ఇండియాలో స్వలింగ సంపర్కులపై కాస్తా చిన్నచూపు ఉంటుంది.

అలాంటిది గ్రామాల్లో, పల్లెల్లో నివసించే హోమో సెక్సువల్స్ పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా ఉంటుంది. లోతైన సంప్రదాయవాద మత, సామాజిక ప్రమాణాలతో గ్రామాలు పాతుకుపోయి ఉంటాయి. అలాంటి పల్లెలు స్వలింగ సంపర్కులపై సానుకూలంగా స్పందించే ఆలోచన నుంచి బయటకు రావడం చాలా కష్టమైనదే. ఎందుకంటే ఈ విధానం వివాహం చేసుకోవడానికి, వంశాన్ని నిలబెట్టేందుకు, కుటుంబ ఆంక్షలు, సామాజిక ఒత్తిళ్లతో పోరాడాల్సి ఉంటుంది.

ఈ విషయాన్నే రోహన్ పరశురామ్ కనవాడే సినిమాగా తెరకెక్కించారు. స్వలింగ సంపర్కంపై మరాఠీ ఫీచ...