భారతదేశం, ఏప్రిల్ 5 -- SAAP Chairman On RK Roja : వైసీపీ ప్రభుత్వంలో పేద క్రీడాకారుల డబ్బులను మాజీ మంత్రి రోజా అప్పనంగా దోచేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు విమర్శించారు. అధికారం అడ్డంపెట్టుకుని రోజా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, త్వరలో రోజా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చెన్నైలో ఉండే రోజాకు ఏపీలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో వైసీపీ నేతలు పగటి వేషగాళ్లలా తయారయ్యారని విమర్శలు చేశారు.

వైసీపీ హయాంలో పేద క్రీడాకారులకు చెందిన రూ.119 కోట్లను మాజీ మంత్రి రోజా కాజేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. రోజా అవినీతి త్వరలోనే బట్టబయలు అవుతుందని చెప్పారు. కోట్లకు కోట్లు నొక్కేసి బంగారు నగలు, నెక్లెస్‌లు కొనుగోలు చేశారని, రోజా బండారం అంతా మరికొన్ని రోజుల్లో బ...