భారతదేశం, ఫిబ్రవరి 9 -- Rythu Bharosa : తెలంగాణ రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి. పెట్టుబడిసాయం కింద రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు రెండు విడతల్లో జమచేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎకరా భూమి ఉన్న రైతులకు తొలి విడత రైతు భరోసా నిధులను జమచేశారు.

తాజాగా రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రేపు లేదా ఎల్లుండి రైతు భరోసా నిధులు జమచేయనున్నారు. ఇప్పటికే ఎకరా వరకు భూమి ఉన్న రైతులకు రూ.6 వేల చొప్పున డబ్బులు వేశారు. గతంలో లాగా ఎకరా, రెండు ఎకరాలు, మూడు ఎకరాల చొప్పున విడతల వారీగా రైతు భరోసా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఎకరం వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వేసింది. రైతుభరోసా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 32 జిల్లాల్లోని 21.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.1,126.54 కోట్ల...