భారతదేశం, మార్చి 29 -- Rythu Bharosa : తెలంగాణలో మరో రెండు రోజుల్లో రైతు భరోసా నిధులు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన... హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలిస్తున్నామన్నారు. ఇవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధులు మరో రెండు రోజుల్లో ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఉగాది రోజున ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

కొత్తగూడెం పట్టణంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశామన్నారు. ఇక్కడ ఎయిర్ పోర్టు వస్తే భద్రాచలం క్షేత్రం మరింత ప్రాచుర్యం పొందుతుందన్నారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, ఆదిలాబాద్ మీదుగా జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు. యాదాద్రి-భద్రాద్రి జ...