భారతదేశం, మార్చి 23 -- రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరించారు. ఇటీవల విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు.. బ్లూ ఫ్లాగ్ ఇండియా అధికారులు ప్రకటించారు. విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు బ్లూ ఫ్లాగ్‌ను జ్యూరీ సభ్యులు అందించారు. దీనిపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1.విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు 'బ్లూ ఫ్లాగ్' గుర్తింపును ఇటీవల ఉపసంహరించారు. బీచ్ పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, బట్టలు మార్చుకునే గదుల దగ్గర శుభ్రత లోపించడం, నడక దారి ధ్వంసం అవ్వడం, రుషికొండ బీచ్‌లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పార్కింగ్ సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం, మౌలిక వసతులు కొరవడడం వంటి కారణాలతో ఉపసంహరించారు.

2.బ్లూ ఫ్లాగ్ అనేది బీచ్‌లకు ఇచ్చే ఒక అంతర్జాతీయ పర్యావరణ గుర్తింపు. ఈ గుర్తింపు పొందిన బీచ్‌లు...