భారతదేశం, మార్చి 3 -- విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ 'బ్లూ ఫ్లాగ్' గుర్తింపును కోల్పోయింది. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్.ఈ.ఈ) సంస్థ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేసింది. రుషికొండ బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందని ఎఫ్‌.ఈ.ఈకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎఫ్.ఈ.ఈ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.బీచ్ పరిసరాల్లో వ్యర్దాలు పేరుకుపోవడం, బట్టలు మార్చుకునే గదుల దగ్గర శుభ్రత లోపించటం, నడక దారి ధ్వంసం అవ్వటం వంటి కారణాల వల్ల బ్లూ ఫ్లాగ్ ట్యాగ్‌ను తొలగించారు.

2.రుషికొండ బీచ్‌లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

3.బీచ్ నిర్వహణను ప్రైవేటు సంస్థ గాలికొదిలేయడం, పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగ...