భారతదేశం, జనవరి 28 -- RTGS ChandraBabu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనసెరిగి ప్రవర్తించడం ఎలాగో కిటుకు తెలిసిన ఐఏఎస్ అధికారులు ఆల్‌ ఈజ్‌ వెల్ నివేదికలతో సీఎంను ప్రసన్నం చేయడం మొదలు పెట్టారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిండా ముంచిన ఆర్టీజీఎస్‌ మళ్లీ పాత పల్లవి అందుకుంది. సచివాలయంలో జరిగిన ఆర్టీజీఎస్‌ సమీక్షలో కొన్ని ప్రభుత్వ శాఖల్లో 90శాతం సంతృప్తి వ్యక్తం అయినట్టు నివేదికలు ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై RTGS లో సీఎం సమీక్షించారు. పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరును సమీక్షించారు. 10 అంశాలపై ఐవిఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆసుపత్...