భారతదేశం, డిసెంబర్ 28 -- చదువు మధ్యలో ఆపేసి వ్యాపారవేత్తలుగా మారి చరిత్ర సృష్టించిన వారి గురించి మనం వినే ఉంటాం. ఆ జాబితాలోకి ఇప్పుడు మరో పేరు చేరింది.. అదే సెలిన్ కొకలర్. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చదువుతూ, మధ్యలోనే డ్రాపౌట్ అయిన సెలిన్, తన మిత్రుడు కరుణ్ కౌశిక్‌తో కలిసి 'డెల్వ్' (Delve) అనే స్టార్టప్‌ను స్థాపించారు. కేవలం రెండేళ్లలోనే దీని విలువను $300 మిలియన్లకు (సుమారు Rs.2,500 కోట్లు) తీసుకెళ్లిన ఈ యువ మేధావి, తాజాగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు.

విజయానికి కేవలం పట్టుదల, కఠోర శ్రమ ఉంటే సరిపోతుందనేది తప్పుడు సలహా అని సెలిన్ స్పష్టం చేశారు. జీవితాన్ని చెట్లు ఎక్కడంతో పోలుస్తూ ఆమె ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు.

"జీవితం అంటే కొన్ని వందల చెట్లు ఉన్న తోట లాంటిది. మీరు ఒక చెట్టుకు నిచ్...