భారతదేశం, జనవరి 28 -- హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ-డిసిప్లినరీ ట్యాక్స్, అడ్వైజరీ సంస్థ SBC LLP, అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. జనవరి 28, 2026న సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. సుమారు 11.2 మిలియన్ డాలర్ల ( Rs.100 కోట్లు) విలువతో ప్రీ-సిరీస్ A నిధులను సేకరించింది.

ఈ ఫండింగ్ రౌండ్‌కు యూఏఈకి చెందిన క్రెస్టన్ మీనన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ రాజు మీనన్, అలాగే అమెరికాకు చెందిన కాస్టెక్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఓఓ సురేష్ కాటంరెడ్డి నాయకత్వం వహించారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా భారత్-యూఏఈ-అమెరికా కారిడార్‌లో వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయాలని సంస్థ భావిస్తోంది.

సేకరించిన పెట్టుబడిని ప్రధానంగా మూడు అంశాల కోసం వెచ్చించనున్నట్లు సంస్థ తెలిపింది.

అంతర్జాతీయ విస్తరణ: సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ వంటి వృద్ధి చె...