భారతదేశం, మార్చి 9 -- RRB Technician Recruitment 2024 notification : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్!. 9వేలకు పైగా పోస్టుల భర్తీ కోసం ఆర్​ఆర్​బీ (రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​) సిద్ధమైంది. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3లోని వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 9144 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 2024 మార్చి 9 నుంచి 2024 ఏప్రిల్ 8 వరకు (11:59 గంటలు) రిజిస్టర్​ చేసుకోవచ్చని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక నోటిఫికేషన్​లో తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆర్​ఆర్​బీ అధికారిక వెబ్​సైట్​ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్​ఆర్​బీ రిక్రూట్​మెంట్​ 2024లో భాగంగా.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష షెడ్యూల...