భారతదేశం, మార్చి 25 -- రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు (ఆర్​ఆర్బీ) ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్​మెంట్ ఎగ్జామినేషన్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ప్రాంతీయ ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్ల నుంచి ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

ఆన్సర్ కీతో పాటు, ఆర్ఆర్బీలు ప్రశ్నపత్రాలను, అభ్యర్థుల రెస్పాన్స్​ షీట్స్​ని కూడా విడుదల చేశాయి.

దీంతోపాటు ఆన్సర్ కీని సవాలు చేసే విండోను కూడా తెరిచారు. అభ్యంతరాలు తెలియజేయాలనుకునే అభ్యర్థులు 2025 మార్చ్​ 29, ఉదయం 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గడువు తర్వాత ప్రశ్నలు, ఆప్షన్లు, కీ లు తదితర అంశాలపై ఆర్ఆర్బీలు ఎలాంటి ప్రాతినిధ్యాన్ని అంగీకరించవు.

ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఆన్సర్ కీ 2025 డౌన్​లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆన్సర్ కీని సవాలు చేయడానికి ...