Hyderabad, మార్చి 16 -- Roshan Kanakala Mowgli Poster Release On His Birthday: తెలుగు రాష్ట్రాల్లో యాంకర్‌గా ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది సుమ కనకాల. తన మాటలు, ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. యాంకర్ సుమ కొడుకుగా రోషన్ కనకాల హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బబుల్ గమ్ సినిమాతో రోషన్ కనకాల టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి చిత్రం బబుల్ గమ్‌లో అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ మౌగ్లీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. ప్రస్తుతం మోగ్ల...