Hyderabad, ఫిబ్రవరి 24 -- చర్మం అద్దంలా మెరవాలని అందరికీ ఉంటుంది. రోజ్ వాటర్‌ను ఉపయోగించే వనితల సంఖ్య కూడా ఎక్కువే. అయితే రోజ్ వాటర్‌ను చర్మ సౌందర్యానికి ఎలా ఉపయోగించాలో ఎంతోమందికి తెలియదు. రోజ్ వాటర్‌ను వాడడం వల్ల చర్మసంబంధిత సమస్యలు కూడా చాలావరకు తగ్గిపోతాయి. అయితే రోజ్ వాటర్‌లో ప్రతిరోజూ రాత్రి విటమిన్ ఈ క్యాప్సూల్ లేదా విటమిన్ ఇ నూనె కలిపి ముఖానికి మసాజ్ చేయడం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది.ఉదయం లేచి ముఖాన్ని చూసుకుంటే కొత్త మెరుపు కనిపిస్తుంది.

రోజ్ వాటర్లో విటమిన్ ఈ కలిపి ఫేస్ మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ముఖం మీద రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ముఖం పైన ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. చర్మంపై ఉన్న చికాకును, ఎరుపును తొలగిస్తుంది. అలాగే ముఖంపై సహజంగానే ఉండే తేమను తిరిగి పొందేలా చేస్తుంది. రంగు కూడా మెరుగు పడుతుంది. ...