Hyderabad, మార్చి 23 -- వేసవి దాహం తీర్చుకోవడానికి, చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు ఎన్నో రకాల డ్రింక్ లు తాగుతుంటారు. వాటితో పాటు మీ డైట్లో గులాబీ పూలతో చేసిన షర్బత్(Rose Sharbat) లేదా గులాబీ పూలతో చేసిన టీ(Rose Tea) లను కూడా చేర్చుకోండి. భారతదేశపు సంప్రదాయ పానీయాల్లో ఒకటైన ఈ గులాబీ పువ్వు పానీయాలు ఎండ వేడిని తట్టుకునేలా చేస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండేందుకు సహాయపడుతాయి.

అంతేకాదు.. మహిళలను ఎంతగానో ఇబ్బంది పెట్టే పీరియడ్స్ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. పీరియడ్స్ సమయంలో రోజ్ షర్బత్ తాగడం అలవాటు చేసుకున్నారంటే ఆ టైంలో వచ్చే నొప్పుల నుంచి చక్కటి ఉపశమనం పొందుతారు. బరువు తగ్గడం కోసం డైట్ చేస్తున్నవాళ్ల తమ డైట్ రోటీన్లో రోజ్ షర్బత్ లేదా రోజ్ టీని చేర్చుకుంటే బరువు తగ్గడం సులభంగా మారుతుంది. గులాబీ పూల టీ లేదా గులాబీ పూల శరబత్ లను తాగడం ...