Hyderabad, ఫిబ్రవరి 16 -- చర్మం మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు. అందులోనూ ముఖ్యంగా మొఖంపై మెరుపు కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. మహిళలు మార్కెట్లో దొరికే ప్రతి ప్రొడక్ట్ ట్రై చేస్తుంటారు. మీరు కూడా ఇలా చేస్తున్నారా! మీరు సహజంగా కెమికల్స్ లేని కాంతివంతమైన మేనిఛాయ పొందాలనుకుంటే, గులాబీలతో ప్రయత్నించండి. ఇంటి దగ్గరే గులాబీలతో ఫేషియల్ చేసుకుని గులాబీ వంటి మేనిఛాయను సొంతం చేసుకోవచ్చు. పూర్తిగా మీ చర్మంపై పింక్ గ్లోయింగ్ సొంతం కావాలంటే, ఈ విధంగా ఫేషియల్ ట్రై చేయండి.

గులాబీతో ఫేస్ క్లెన్జర్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం మీరు గులాబీ ఎసెన్షియల్ ఆయిల్, పెరుగు, ఒక చెంచా శెనగపిండి తీసుకోండి. అన్నింటిని సమపాళ్లలో కలిపి క్లెన్జర్‌ను రెడీ చేసుకోండి. అవసరమైతే కొన్ని నీళ్లను కలిపి క్లెన్జర్‌ను మీ ముఖం అంతటా అప్లై చేసుకోండి. ఆ తర్వాత వేళ్ల సహాయంతో 10 న...