Hyderabad, ఫిబ్రవరి 7 -- ప్రేమ అనే ప్రస్తావన వచ్చిన వెంటనే గుర్తొచ్చేది రోజ్ ఫ్లవర్ (గులాబీ పువ్వు). ప్రేమను వ్యక్తపరచడానికి ప్రతి ఒక్కరూ వాడేది గులాబీ పువ్వునే. కొన్ని సందర్భాల్లో మాటలు లేకున్నా గులాబీ పువ్వే మాట్లాడుతుంది. సినిమాల్లోనూ ఇలాంటి సీన్లు బోలెడు. ఒక గ్రీటింగ్ కార్డ్ దాంతో పాటు ఒక రెడ్ రోజ్ ఫ్లవర్. చాలా మందికి ఇవే తెలుసు కదా. నిజానికి ప్రేమ అంటే కేవలం ఎర్ర గులాబీ మాత్రమే కాదు. ప్రేమను వ్యక్తీకరించడానికి మరిన్ని రంగుల గులాబీలను వాడొచ్చు. ఒక్కో రంగు గులాబీకి ప్రత్యేకమైన అర్థముందట.

మరి, ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజున మీ ప్రేమను బయట పెట్టేద్దాం అనుకుంటున్నారా? రోజా పూలతో విష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే వాలెంటైన్స్ వీక్‌లో వచ్చే మొదటి రోజెైన రోజ్ డే నాడు పువ్వులతో మీ ప్రేమను వ్యక్తరచండి. ప్రతి ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ ...