భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలుగు రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేమ‌దేశ‌పు యువ‌రాణి థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. సోమ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీలో యామిన్ రాజ్‌, విరాట్ కార్తీక్‌, ప్రియాంక రేవ్రి హీరోహీరోయిన్లుగా న‌టించారు. సాయిసునీల్ నిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని అయిన సాయిసునీల్ నిమ్మ‌ల‌కు డైరెక్ట‌ర్‌గా ప్రేమ దేశ‌పు యువ‌రాణి సెకండ్ మూవీ. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న ఈ మూవీని రిలీజ్ చేశారు. ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌కు ఓ థ్రిల్ల‌ర్ ఎలిమెంట్‌ను జోడించి ఈ సినిమా రూపొందింది. కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద...