భారతదేశం, మార్చి 27 -- Romantic Thriller OTT: మలయాళం క‌మెడియ‌న్ అల్తాఫ్ స‌లీమ్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ మందాకిని తెలుగులోకి వచ్చింది. గురువారం ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సెలైంట్‌గా ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోన్న విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. మందాకిని మూవీకి వినోద్ లీలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అనార్క‌లి మ‌రిక్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

ఎలాంటి అంచానాలు లేకుండా గ‌త ఏడాది మే నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన మందాకిని మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. కోటి రూపాయల లోపు బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన మందాకిని మూవీ మూడు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వైరెటీ కాన్సెప్ట్‌తో పాటు కామెడీతో ఈ మూవీ అభిమానుల...