భారతదేశం, ఏప్రిల్ 8 -- టోవినో థామ‌స్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోహీరోయిన్లుగా న‌టించిన మ‌ల‌యాళం రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ మాయాన‌ది తెలుగు వెర్ష‌న్ ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ మూవీని ఎలాంటి రెంట‌ల్‌, స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా 4కే క్వాలిటీతో ఫ్రీగా తెలుగులో చూడొచ్చు. మాయాన‌ది సినిమాకు ఆషిక్ అబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2017లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. 2010 - 2020 మ‌ధ్య‌కాలంలో వ‌చ్చిన టాప్ 25 బెస్ట్ మ‌ల‌యాళ సినిమాల్లో ఒక‌టిగా మాయాన‌ది నిలిచింది. కాన్సెప్ట్‌తో పాటు టోవినో థామ‌స్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి యాక్టింగ్‌, వారిద్ద‌రి కెమిస్ట్రీకి మంచి పేరు వ‌చ్చింది. ఫ్రెంచ్ మూవీ బ్రీత్‌లెస్ స్ఫూర్తితో మాయాన‌ది రూపొందింది. ఈ సినిమాలోని క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియెన్స్‌ను మెప్పించింది.

మాయాన‌ది మూవీలో ...