Hyderabad, ఫిబ్రవరి 21 -- Romantic Scenes: మార్కో మూవీ స్టార్ ఉన్ని ముకుందన్ తెలుసు కదా. అంతకుముందే తెలుగులో భాగమతి, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు చేశాడు. ఈ హీరో తన కెరీర్లో కిస్సింగ్, రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇన్నేళ్లయినా ఇప్పటికీ అతడు అదే పాలసీని కొనసాగిస్తున్నాడు. ఇక మీదటా అదే పని చేస్తానని స్పష్టం చేశాడు.

మలయాళం సినిమా ఇండస్ట్రీ చరిత్రలో మోస్ట్ వయోలెంట్ మూవీగా నిలిచిన మార్కోతో ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఉన్ని ముకుందన్. బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయిన ఈ సినిమా.. ఈ మధ్యే సోనీ లివ్, ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఉన్ని ముకుందన్ గెట్ సెట్ బేబీ అనే మరో మూవీతో వచ్చాడు. సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 21) రిలీజైంది. ఇందులో అతడు ఓ గైనకాలజిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ పాత్ర కావడం విశేషం....