Hyderabad, మార్చి 1 -- శృంగారాన్ని ఎంజాయ్ చేయడంలో స్త్రీ, పురుషులిద్దరిలో ఎవరెలా ఎంజాయ్ చేస్తారనే పరిశోధనలపై ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. అందరి ఆలోచనల్లో మగవారు కేవలం లైంగిక చర్యను మాత్రమే ఎంజాయ్ చేస్తారనేది అపోహేనని తేలింది. మగవారిలోనే కంటే మహిళల కంటే ఎక్కువగా రొమాన్స్ ఎంజాయ్ చేయాలనే కోరిక ఉంటుందట. ఇలా చేయడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై చక్కటి ప్రభావం కనపడుతుందట. పురుషులు ప్రేమ బంధాలలో ఓ రకమైన హర్షం పొందుతారట. కానీ విడిపోయే సమయంలో మాత్రం వారిలో బాధ అనేది ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది ఎందుకు జరుగుతుందంటే, చిన్నప్పటి నుంచి మగపిల్లలు పెరిగిన తీరే ఇందుకు కారణమట. మగ పిల్లల్ని సామాజికంగా భావోద్వేగాలను దాచిపెట్టుకుని ప్రవర్తిస్తుంటారు. ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకుంటే, దాన్ని సమాజం అంగీకరించదు, ఇలా మగవారు నియంత్రణలో ఉం...