Hyderabad, జనవరి 27 -- ఫిబ్రవరి నెలను ప్రేమ మాసం అంటారు. ఎందుకంటే వాలెంటైన్స్ డే ఈ నెలలో వస్తుంది. ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ వీక్ నిర్వహించుకుంటారు. వారం రోజుల పాటూ ప్రేమ పక్షులు పండగ చేసుకుంటారు. ఈ మాసం ప్రేమ పక్షులకు ఇష్టమైనది. అందుకే చాలా మంది జంటలు ఈ నెలలో ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ఫిబ్రవరిలో మీ భాగస్వామితో హాలిడేస్ కు వెళ్లాలనుకుంట, రొమాంటిక్ ప్లేస్ కోసం చూస్తున్నట్లయితే, కొన్ని ఉత్తమ ప్రదేశాలు ఇక్కడ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఎంతో మనోహరంగా, ఆహ్లాదంగా ఉంటాయి. మీ భాగస్వామితో పాటూ మీరు మనదేశంలోనే ఏఏ ప్రదేశాల్లో ఎంజాయ్ చేయవచ్చో తెలుసుకోండి.

ఫిబ్రవరిలో సందర్శించడానికి అత్యంత అందమైన ప్రదేశం డార్జిలింగ్. ఎక్కువమంది జంటలు ఇష్టపడే హనీమూన్ గమ్యస్థానాలలో డార్జిలింగ్ ఒకటి. పశ్చిమ బెంగాల్ లో ఉన్న ఈ ప్రదేశం తేయాకు తోటలతో నిండి ఉంటుంది. ...