భారతదేశం, మార్చి 29 -- Romantic OTT: విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన త‌మిళ మూవీ మామ‌నిథ‌న్ మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

మా మ‌నిథ‌న్ మూవీకి సీను రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ త‌మిళ మూవీలో విజ‌య్ సేతుప‌తికి జోడీగా గాయ‌త్రి హీరోయిన్‌గా న‌టించింది. అనిఖా సురేంద్ర‌న్‌, గురు సోమ‌సుంద‌రం కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 2022లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌రైన విజ‌యాన్ని సాధించ‌లేదు. ఈ సినిమాలో అస‌మాన న‌ట‌న‌తో విజ‌య్ సేతుప‌తి అభిమానుల‌ను మెప్పించాడు.

రాధాకృష్ణ (విజ‌య్ సేతుప‌తి) నిజాయితీప‌రుడైన ఓ ఆటోడ్రైవ‌ర్‌...