భారతదేశం, ఏప్రిల్ 12 -- బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 ర‌న్న‌ర‌ప్ గౌత‌మ్ కృష్ణ హీరోగా న‌టించిన ఆకాశ వీధుల్లో మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆకాశ వీధుల్లో సినిమాకు గౌత‌మ్ కృష్ణ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హీరోగా, డైరెక్ట‌ర్‌గా ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమాలో పూజిత‌ పొన్నాడ హీరోయిన్‌గా న‌టించింది. 2022లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. ఆకాశ వీధుల్లో మూవీలో స‌త్యం రాజేష్‌, దేవీప్ర‌సాద్‌తో పాటు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ హ‌ర్షిత్ గౌర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ సినిమాకు జుడా శాండీ మ్యూజిక్ అందించాడు. ప్రేమ‌, లివింగ్ రిలేష‌న్, కెరీర్ లాంటి విష‌యాల్లో యువ‌త‌రంలో ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్స్ ఉంటాయ‌నే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ...