భారతదేశం, ఏప్రిల్ 4 -- Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ 14 డేస్ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్‌, ప్ర‌మోష‌న్స్‌ లేకుండా స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చి తెలుగు ఆడియెన్స్‌ను ఈ మూవీ స‌ర్‌ప్రైజ్ చేసింది. థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రావ‌డం గ‌మ‌నార్హం.

14 డేస్ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో మూవీలో అంకిత్ కొయ్య‌, శ్రియా కొంతం హీరోహీరోయిన్లుగా న‌టించారు. వెన్నెల‌కిషోర్, ఇంద్ర‌జ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీహ‌ర్ష మ‌న్నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌ల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ‌ను నేటిత‌రం యువ‌త‌ ఎలా మిస్‌యూజ్ చేస్తున్నార‌నే సందేశానికి కామెడీని జోడించి ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

మార్చి ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో ...