భారతదేశం, జనవరి 31 -- Romantic Comedy OTT: హెబ్బా ప‌టేల్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ధూం ధాం ఓటీటీలోకి వ‌చ్చింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఈ మూవీ శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన మూడు నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ధూం ధాం మూవీలో చేత‌న్ కృష్ణ హీరోగా న‌టించాడు. వెన్నెల కిషోర్‌, సాయికుమార్‌, గోప‌రాజు ర‌మ‌ణతో పాటు ప‌లువురు టాలీవుడ్ క‌మెడియ‌న్లు ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించారు. గోపిమోహ‌న్ క‌థ‌, స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చిన ఈ మూవీకి సాయికిషోర్ మ‌చ్చా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో ధూం ధాం మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. వ‌ల్గారిటీ, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డైరెక్ట‌ర్ ఈ మూవీని తెర‌కెక్కిం...