భారతదేశం, ఫిబ్రవరి 10 -- తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ కాదలిక్క నేరమిళ్లై చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైంది. రవి మోహన్ (జయం రవి), నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మోడ్రన్ రిలేషన్లతో కూడిన కామెడీ మూవీగా ప్రశంసలు పొందింది. ఈ మూవీ నెల ముగియకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లో కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

కాదలిక్క నేరమిళ్లై చిత్రం రేపు (ఫిబ్రవరి 11) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు నెట్‍ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసింది. థియేటర్లో తమిళంలో ఒక్కటే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో వస్తుండటంతో మంచి క్రేజ్...