భారతదేశం, మార్చి 8 -- Romantic Comedy OTT: బిగ్‌బాస్ తెలుగు ర‌న్న‌ర‌ప్‌ శ్రీహాన్ హీరోగా ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోన్నాడు. లైఫ్ పార్ట్‌న‌ర్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. లైఫ్‌పార్ట్‌న‌ర్ మూవీ పోస్ట‌ర్‌ను ఈటీవీ విన్ ఓటీటీ అభిమానుల‌తో పంచుకున్న‌ది. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

లైఫ్ పార్ట్‌న‌ర్ మూవీలో శ్రీహాన్‌కు జోడీగా సోనియా సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. లైఫ్ పార్ట్‌న‌ర్ సినిమాను టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కే రాఘ‌వేంద్ర‌రావు నిర్మిస్తున్నారు. ప్రొడ్యూస‌ర్‌గానే కాకుండా లిరిక్స్‌, స్క్రీన్‌ప్లేను అందిస్తూనే ద‌ర్శ‌క‌త్య ప‌ర్య‌వేక్ష‌కుడిగా రాఘ‌వేంద్ర‌రావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాంకీ ద‌ర్శ‌క‌...