భారతదేశం, ఫిబ్రవరి 8 -- వర్ధన్ పూరి, కావేరి కపూర్ హీరోహీరోయిన్లుగా బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ మూవీ వస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించారు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారడం, వారి మధ్య దూరం రావడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 8) రిలీజ్ అయింది.

కేమ్‍బ్రిడ్జ్ బ్యాక్‍డ్రాప్‍లో బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ మూవీ సాగుతుంది. చదువుకునేందుకు అక్కడికి వెళ్లిన బాబీ (కావేరి కపూర్), రిషి (వర్దన్ పూరి) ఒకరినొకరు ఇష్టపడతారు. ఇద్దరూ కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. ఆ తర్వాత లవ్‍లో పడతారు. ఇంతలో వారు దూరం కావాల్సి వస్తుంది. కేంబ్రిడ్జ్ నుంచి వారివారి ఊర్లకు వెళ్లిపోతారు. దూరమయ్యాక తాము ఏదో పోగొట్టుకున్నట్టు బా...