భారతదేశం, ఫిబ్రవరి 21 -- Romantic Comedy OTT: మ‌హ‌త్ రాఘ‌వేంద్ర‌, మాన‌స చౌద‌రి, దేవిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ రొమాంటిక్ వెబ్‌సిరీస్ ఎమోజీ తెలుగులోకి వ‌స్తోంది. సేమ్ టైటిల్‌తో ఆహా ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు ఆహా ఓటీటీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

ఎమోజీ వెబ్ సిరీస్‌కు సెన్ రంగ‌సామీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2022లో త‌మిళంలో రిలీజైన ఈ వెబ్‌సిరీస్ రెండేళ్ల త‌ర్వాత తెలుగులోకి వ‌స్తోంది. మోడ్ర‌న్ డే రిలేష‌న్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోజీ వెబ్‌సిరీస్ రూపొందింది. ఓ జంట మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఎలా పెళ్లికి దారితీసింది? త‌ను ప్రేమించిన అమ్మాయికి విడాకులు ఇచ్చి మ‌రో అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాల‌ని ఆ యువ‌కుడు ఎందుకు అనుకున్నాడు? విడాకులు తీసుక...