భారతదేశం, మార్చి 11 -- మ‌ల‌యాళం అగ్ర హీరో ఫ‌హాద్ ఫాజిల్ నిర్మించిన పైంకిలి మూవీ ఓటీటీలోకి రాబోతోంది. రొమాంటిక్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో రేఖ‌చిత్రం ఫేమ్ అన‌శ్వ‌ర రాజ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. సాజిన్ గోపు, జిస్మ విమ‌ల్‌, రోష‌న్ షాన్‌వాస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ లిజో జోస్ పెల్లిస‌రి ఈ మూవీలో న‌టుడిగా క‌నిపించాడు. ఆవేశం ఫేమ్ జీతూ మాధ‌వ‌న్ ఈ సినిమాకు క‌థ‌ను అందించారు. అంతే కాకుండా ఫ‌హాద్ ఫాజిల్‌తో క‌లిసి జీతూ మాధ‌వ‌న్ పైంకిలి మూవీని ప్రొడ్యూస్ చేశాడు.

పైంకిలి మూవీ త్వ‌ర‌లో మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. మార్చి 14న ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే రోజు అమెజాన్ ప్రైమ్‌లో కూడా విడ...