భారతదేశం, మార్చి 13 -- Romantic Action OTT: క‌న్న‌డ న‌టి ర‌న్యారావు హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ వాఘా స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. వాఘా మూవీలో విక్ర‌మ్ ప్ర‌భు హీరోగా న‌టించాడు. 2016లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. ఈ సినిన‌మాకు జీఎన్ఆర్ కుమ‌ర‌వేల‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

థియేట‌ర్ల‌లో రిలీజైన తొమ్మిదేళ్ల‌ త‌ర్వాత వాఘా హిందీ వెర్ష‌న్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త‌మిళ వెర్ష‌న్ మాత్రం ఫ్రీగా యూట్యూబ్‌లోఅందుబాటులో ఉంది. వాఘా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

వాఘా మూవీపై రిలీజ్‌కు ముందు భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా థియేట‌ర్ల‌లో ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. వాఘా మూవీతోనే ర‌న్యా రావు హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇ...