భారతదేశం, ఫిబ్రవరి 6 -- లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భారత మార్కెట్లోకి తమ సరికొత్త ఘోస్ట్ సిరీస్ 2 మోడల్‌ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త ఇంటీరియర్ ఫీచర్లను, ఎక్స్‌టీరియర్ ఫీచర్లను ఈ సిరీస్‌తో పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. అధునాతన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ సహాయంతో రూపొందించిన ఈ లగ్జరీ కారుతో వినియోగదారులు డిజిటల్ ప్రపంచానికి మరింత చేరువయ్యేలా చేశారు.

'ఘోస్ట్ సిరీస్ సామర్థ్యాలను మా వినియోగదారులు తప్పకుండా ప్రశంసిస్తారని ఆశిస్తున్నాం. ఘోస్ట్ సిరీస్ 2 ప్రత్యేక ఉనికిని చాటుతుంది. మునుపెన్నడూ లేని విధంగా అధునాతన సాంకేతికత వినియాగంతో ఈ డ్రైవర్ ఫోకస్డ్ వీ 12 రోల్స్ రాయిస్ లగ్జరీ కారు ప్రత్యేకంగా నిలవనుంది. భారతదేశంలో లగ్జరీ కార్లను కోరుకునేవారికి రోల్స్ రాయిస్ మెుదటిస్థానంలో ఉంటుంది. ఘోస్ట్ సిరీస్ 2 ప్రస్తుతం భారతదేశ...