Hyderabad, ఫిబ్రవరి 10 -- Rohit Sharma: రోహిత్ శర్మ వన్డేల్లో సుమారు 16 నెలల తర్వాత సెంచరీ చేయడంతో అతనిపై ఇప్పుడు అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అయితే రోహిత్ ను ఆకాశానికెత్తాడు. విమర్శకుల నోళ్లు మూయాల్సింది ఇలాగే అని బిగ్ బీ అనడం విశేషం. తన బ్లాగ్ లో టీమిండియా కెప్టెన్ గురించి ఎంతో విలువైన మాటలు రాశాడు.

తనను విమర్శిస్తున్నవారికి ఎప్పుడైనా అంచనాలకు మించి రాణించి సమాధానం చెప్పాలని, రోహిత్ అదే చేశాడని అమితాబ్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. "మనం నిల్చొన్న కాళ్లు.. అవి తిరిగే నేల.. అందుకోసం తిరిగిన దూరం.. చివరికి వాటికి కావాల్సిన మసాజ్ చేస్తే.. ఇన్నేళ్లూ ఏం మిస్సమయ్యామో మనకు తెలుస్తుంది.

ప్రధాన ఈవెంట్లో కాస్త తగ్గినా.. క్రికెట్ లో మాత్రం బ్రిట్స్ కు సాహసోపేతమైన దెబ్బ కొట్టాడు. అత్యద్భుతం. అం...