భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‍తో గురువారం జరిగిన తన తొలి గ్రూప్-ఏ మ్యాచ్‍లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్‍కు హ్యాట్రిక్ ఛాన్స్ కాస్తలో మిస్ అయింది. మ్యాచ్ ముగిశాక ఈ విషయంపై టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడాడు. తన తప్పిదాన్ని అంగీకరించాడు.

9వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు తంజిద్ అహ్మద్, ముష్పికర్ రహీమ్‍ను అక్షర్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. హ్యాట్రిక్ ఛాన్స్ ఉండటంతో తదుపరి బంతికి రెండు స్లిప్‍లను పెట్టాడు రోహిత్ శర్మ. అయితే, బంతి జాకేర్ అలీ బ్యాట్ ఎడ్జ్ తలిగి ఫస్ట్ స్లిప్‍లో ఉన్న రోహిత్‍కే క్యాచ్ వచ్చింది. అయితే, క్యాచ్‍ను మిస్ చేశాడు హిట్‍మ్యాన్. దీంతో అక్షర్ పటేల్‍కు హ్యాట్రిక్ మిస్ అయింది. లేకప...