భారతదేశం, మార్చి 28 -- నితిన్‌, శ్రీలీల హీరోహీరోయిన్లుగా న‌టించిన రాబిన్‌హుడ్ మూవీ మార్చి 28న (నేడు) థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ గెస్ట్ పాత్ర‌లో న‌టించిన ఈ మూవీకి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించింది. రాబిన్‌హుడ్ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

రాబిన్‌హుడ్ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్‌కు మిక్స్‌డ్ టాక్ వ‌స్తోంది. హిలేరియ‌స్ కామెడీతో సినిమా న‌వ్వించింద‌ని కొంద‌రు నెటిజ‌న్లు చెబుతోండ‌గా....మ‌రికొంద‌రు మాత్రం రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఇద‌ని, కొత్త‌గా చెప్పుకోవ‌డానికి సినిమాలో ఏం లేద‌ని ట్వీట్లు పెడుతోన్నారు.

రాబిన్‌హుడ్ ఎబోవ్ యావ‌రేజ్ మూవీ అని, ఫ‌స్ట్ హాఫ్ బాగుంద‌ని, సెకండాఫ్ మాత్రం ఓకేగా అనిపిస్తుంద‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు....