భారతదేశం, మార్చి 24 -- నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్‍హుడ్ సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. మరో నాలుగు రోజులలో మార్చి 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ కూడా ఎంటర్‌టైనింగ్‍గా మెప్పిస్తోంది. దీంతో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ కామెడీ యాక్షన్ చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ తరుణంలో రాబిన్‍హుడ్ సినిమా ఓటీటీ, శాటిలైట్ డీల్ గురించి వివరాలు బయటికి వచ్చాయి.

రాబిన్‍హుడ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందనే సమాచారం బయటికి వచ్చింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం జీ5లో రానుంది. ఈ మూవీ టెలికాస్ట్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ సొంతం చేసుకుందని సమాచారం. ఇలా, ర...