భారతదేశం, ఫిబ్రవరి 5 -- నితిన్ హీరోగా రాబిన్‍హుడ్ సినిమా తెరకెక్కుతోంది. గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. భీష్మ తర్వాత ఐదేళ్లుగా సరైన హిట్ కోసం నిరీక్షిస్తున్న నితిన్ ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుమలనే రాబిన్‍హుడ్ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రాబిన్‍హుడ్ చిత్రంలో విలన్ ఎవరో నేడు (ఫిబ్రవరి 5) అధికారికంగా వెల్లడైంది.

రాబిన్‍హుడ్ చిత్రంలో బాలీవుడ్ నటుడు దేవ్‍దత్త నాగే మెయిన్ విలన్‍గా నటిస్తున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించిన ఆదిపురుష్ చిత్రంలో ఆంజనేయుడిగా దేవ్‍‍దత్త నటించారు. ఇప్పుడు రాబిన్‍హుడ్‍లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు.

దేవ్‍దత్త నాగే పుట్టిన రోజు సందర్బంగా నేడ...