Hyderabad, ఫిబ్రవరి 21 -- సాయంత్రం కాగానే చాలా మందికి చాయ్‌ లేదా కూల్ డ్రింక్‌తో కలిపి క్రిస్పీగా, కాస్త కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. అది సహజంగా అందరికీ జరిగేదే. కానీ ఏం తినాలి, ప్రతి రోజూ ఇలా ఏం తయారు చేసుకోవాలి అనేదే సమస్య. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకునే వారికైతే ఇదీ మరీ పెద్ద సమస్య. మీకు కూడా సాయంత్రం కాగానే టీ,కాఫీలు లేదా కూల్ డ్రింక్‌లతో పాటు ఏదైనా స్పైసీ, క్రిస్పీ స్నాక్ తినాలని తరచూ అనిపిస్తుంటే రోస్టెడ్ చనా నమ్‌కీన్ రెసిపీ మీ కోసమే. వీటిని ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

బయట దొరికే చౌక, అనారోగ్యకరమైన నూనెలో వేయించిన స్నాక్స్, నమ్‌కీన్ తినే బదులు ఇంట్లోనే క్రిస్పీగా, కాస్త కారంగా ఇలా రోస్టెడ్ చనా నమ్‌కీన్ తయారు చేసుకోవచ్చు. తెల్ల శనగలు లేదా కబూలీ శనగలతో తయారు చేసుకనే ఈ రెసిపీకి ఎక్కువ సమయం కూడా పట్టదు. అ ఆల...