భారతదేశం, మార్చి 26 -- Road Accident: పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలను లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కావడంతో మాపటి కూలీ కోసం వెళ్తుండగా.. అటుగా వచ్చిన పత్తి గింజల బస్తాల లారీ వారిపైకి దూసుకొచ్చింది. దీంతో కూలీలు పక్కనే ఉన్న పొలంలోకి పరుగులు తీశారు. లారీ బోల్తా పడి అందులో ఉన్న బస్తాలు వారిపై కూలడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. ఇంకొందరు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఈ ఘటన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (టీ) గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రామకృష్ణాపూర్ (టి) గ్రామానికి చెందిన మోకిడి సంధ్య (28), మోకిడి పూలమ్మ (45) సమీప బంధువులు. ఎండా కాలం కావడంతో గ్రామంలోని కొ...