Hyderabad, ఫిబ్రవరి 25 -- RK Roja Re Entry With Zee Telugu Super Serial Championship: నటిగా, పొలిటిషియన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఆర్కే రోజా సెల్వమణి. రాజకీయాల్లో ప్రత్యర్థులకు మాస్ డైలాగ్స్‌తో సమాధానం చెప్పే రోజా జబర్దస్త్ కామెడీ షోలో కొన్నిసార్లు కమెడియన్లకో పంచ్‌లు వేసి నవ్వించారు.

హీరోయిన్‌గా, నటిగా బ్రేక్ తీసుకున్న రోజా బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ షోలతో ఫుల్ బిజీగా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎలాంటి టీవీ షోలలో పాల్గొనని, పూర్తిగా ప్రజల సేవలోనే ఉంటానని రోజా చెప్పారు. అయితే, మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం, నగరి నియోజకవర్గంలో రోజా ఓడిపోయిన విషయం తెలిసిందే.

దీంతో ఇప్పుడు బుల్లితెరపై ఆర్కే రోజా రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కాన...