భారతదేశం, ఫిబ్రవరి 13 -- Ritika Singh: గురు ఫేమ్ రితికా సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ వ‌ళ‌రి థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారాఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో మార్చి 6 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. వ‌ళ‌రి రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ అనౌన్స్‌చేసింది. రితికా సింగ్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో రితికా సింగ్ వెనుక ద‌య్యం రూపంలో మ‌రో అమ్మాయి క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

వ‌ళ‌రిలో దివ్య అనే యువ‌తిగా రితికా సింగ్ క‌నిపించ‌బోతున్న‌ది. దివ్య‌...ద‌యాగుణం గ‌ల అమ్మాయి. ప్ర‌తి ఒక్క‌రితో మంచిగా ఉంటుంది. కానీ ప్ర‌పంచానికి తెలియ‌ని ఓ గ‌తం ఆమె జీవితంలో దాగుంది. అదేమిటి అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క‌లిగిస్తున్నారు మేక‌ర్స్‌. క్యాప్ష‌న్ చూస్తుంటే డిఫ‌రెంట్ షే...