భారతదేశం, మే 24 -- టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. మరో క్రికెటర్ చేతిలో మోసపోయాడు. స్వతహాగా ఆడంబరాలు, లగ్జరీ వాచీలు, నగలు మెచ్చే పంత్‌ను కోరికలను ఆసరా తీసుకుని హరియాణాకు చెందిన మృణాంక్ సింగ్ అనే క్రికెటర్ మోసగించాడు. ఖరీదైన వాచీలను మంచి రేటుకు అమ్మిపెడతానని పంత్‌ను నమ్మబలికి రెండు కోట్ల వరకు సొమ్మును కాజేశాడు. ఖరీదైన వాచీలు, నగలు, మొబైల్ ఫోన్లను(Used things) మంచి ధరకు అమ్మిపెడతానని, అలాగే బ్రాండెడ్ వాచీలను అతి తక్కువ ధరకే ఇప్పిస్తానని రిషభ్ పంత్‌ను కలిశాడు.

ప్రస్తుతం మృణాంక్ సింగ్ ముంబయి ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. ఓ వ్యాపారువేత్త ఫిర్యాదుతో అతడిని పోలీసులు అరెస్టు చేశాడు. దాదాపు రూ.2 వరకు కోట్లను మోసపోయిన పంత్.. తన లాయర్ పునీత్ సోలంకీ సహాయంతో మృణాంక్‌పై చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. ఇప్పటికే జైలులో ఉన్న అతడిపై ఈ ఫిర్యాదున...