భారతదేశం, నవంబర్ 28 -- World cup riots in Brussels : 2022 ఫిఫా వరల్డ్​ కప్​లో ఊహించిన పరిణామం ఎదురవడంతో బెల్జియం ఫ్యాన్స్​ ఆగ్రహం కట్టలు తెంచుకుంది! ఖతార్​ వేదికగా జరుగుతున్న ఫుట్​బాల్​ వరల్డ్​ కప్​లో.. బెల్జియంపై మొరాకో 2-0 తేడాదో గెలుపొందడం.. ఆ దేశ ప్రజలకు మింగుడుపడలేదు. ఫలితంగా బ్రసెల్స్​వాసులు.. నగరంలో విధ్వంసం సృష్టించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు.

మ్యాచ్​ ముగిసే సమయానికన్నా ముందే బ్రసెల్స్​లో హింస చెలరేగింది. పదుల సంఖ్యలో ప్రజలు.. హుడీలు ధరించి రోడ్ల మీదకొచ్చారు. దుకాణాల అద్దాలు పగలగొట్టారు. వాహనాలకు నిప్పంటించారు. ఎలక్ట్రిక్​ వాహనాలు కూడా తగలబడ్డాయి. టపాసులు పేల్చి.. బెల్జియం జట్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్రలు, రాడ్లు పట్టుకుని బ్రసెల్స్​ వీధుల్లో పరుగులు తీశారు. కనిపించిన వస్తువును.. ముందు వెనక చూసుకోకుండా ధ్వంసం ...